Newsనాని-అఖిల్ ఎవరి సత్తా ఎంత..?

నాని-అఖిల్ ఎవరి సత్తా ఎంత..?

నాచురల్ స్టార్ గా నాని వరుస విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మొదలైన నాని హిట్ సినిమాల హవా రీసెంట్ గా రిలీజ్ అయిన నిన్ను కోరి సినిమాతో కూడా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎం.సి.ఏ మూవీని కూడా డిసెంబర్ 21న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

మంచి ఫాంలో ఉన్న నానికి అక్కినేని అఖిల్ సినిమా పోటీ వస్తుంది. మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ అవడంతో సెకండ్ మూవీ కోసం చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ 22న ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నాని అఖిల్ ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారనుంది.

పెద్ద సినిమాలే ఒకే రోజు డీ కొడుతుంటే యంగ్ హీరోలైన ఈ ఇద్దరు ఒకేసారి ఫైట్ చేయకపోతే ఎలా అనుకున్నారో ఏమో కాని మొత్తానికి నాని అఖిల్ బాక్సాఫీస్ ఫైట్ షురూ అవుతుంది.. మరి వారిద్దరిలో ఎవరి సత్తా ఎంత అన్నది ఆరోజు మాత్రమే తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news