Moviesసప్తగిరికి భయపడిన నాని..!

సప్తగిరికి భయపడిన నాని..!

నాచురల్ స్టార్ నాని హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎం.సి.ఏ. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది. సినిమా నుండి వచ్చిన టీజర్, రిలీజ్ అయిన రెండు సాంగ్స్ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొచ్చాయి. నాని సప్తగిరి హీరోగా నటిస్తున్న సప్తగిరి ఎల్.ఎల్.బి సాంగ్ ను రిలీజ్ చేశాడు.
ట్రైలర్ ను రాం చరణ్ తో రిలీజ్ చేసిన సప్తగిరి అండ్ టీం నానితో పాటని విడుదల చేయించారు. ఇక సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన నాని సప్తగిరి మంచి నటుడని సినిమా చాలా కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పారు. ఇక ఈ సినిమా రిలీజ్ నా సినిమాకు పోటీగా రావట్లేదుగా అంటూ కామెడీ చేశాడు నాని. డిసెంబర్ 9న సప్తగిరి ఎల్.ఎల్.బి రిలీజ్ అవుతుంది.
జాలి ఎల్.ఎల్.బి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాతో సప్తగిరి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడని తెలుస్తుంది. ట్రైలర్, సాంగ్స్ సినిమాలో విషయం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న సప్తగిరి ఎల్.ఎల్.బి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news