Movies ప్రేమ పేరుతో రామ్ లవర్‌ని తెగ ఇబ్బంది పెట్టిన ‘లోకల్’...

ప్రేమ పేరుతో రామ్ లవర్‌ని తెగ ఇబ్బంది పెట్టిన ‘లోకల్’ నాని

Natural star Nani’s latest movie Nenu Local trailer has released and it really very impressive.

వరుసగా ఐదు విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నేను లోకల్’. త్రినాథ్ రావ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘నేను శైలజా’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్, టీజర్స్‌కి మంచి స్పందనే వచ్చింది. ఇక రీసెంట్‌గా జరిగిన ఆడియో వేడుక సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేయగా.. దానికీ అనూహ్య రెస్పాన్స్ వస్తోంది.

నాని చెప్పే కాలేజ్ డైలాగ్‌తో స్టార్ట్ అయ్యే ఈ ట్రైలర్.. ఆద్యంతం వినోద్మాతకంగా సాగింది. స్టోరీలైన్ చూస్తే.. కాలేజ్‌లో ఓ అమ్మాయిని ప్రేమించమని నిత్యం ఆమె వెంపడుతూ తెగ ఇబ్బంది పెట్టే యువకుడి స్టోరీలా కనిపిస్తోంది. అయితే.. చివర్లో హీరో మాస్ అవతారంలోకి టర్న్ అయ్యే పాయింటే ట్విస్ట్‌లా అనిపిస్తోంది. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్‌ విషయానికొస్తే.. నాని ఎప్పట్లానే తన నేచురల్ యాక్టింగ్‌తో కట్టిపడేశాడు. కాలేజ్‌లో అల్లరిచిల్లరిగా తిరిగే అబ్బాయిలా.. ప్రేమించమని అమ్మాయిని టార్చర్ పెట్టే ప్రేమికుడిలా రక్తి కట్టించాడు. చివర్లో మాస్ అవతారంలోనూ ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ మరోసారి తన టాలెంట్‌తో ఆకట్టుకుంది. సరదాగా సాగే ఈ ట్రైలర్‌లో కొన్ని డైలాగులు అదిరాయి.. నవ్వులు కూడా తెప్పించాయి. ఓవరాల్‌గా చూస్తే.. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ అంశాలతో ఈ ట్రైలర్ ఆకట్టుకుంది.

ఇక టెక్నికల్ పరంగా చూస్తే.. ‘సినిమా చూపిస్త మావా’ సినిమాతో తన టాలెంట్ చూపించుకున్న త్రినాథ్ రావ్ టేకింగ్ బాగుంది. అలాగే.. సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, దేవిశ్రీ అందించిన మ్యూజిక్, దిల్ రాజు నిర్మాణ విలువలు అదిరాయి. టోటల్‌గా చూస్తే.. ఈ ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేసింది యూనిట్. మరి.. ఈ సినిమా ఆడియెన్స్‌ని మెప్పిస్తుందా? లేదా? వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news