Moviesనాని కృష్ణార్జున యుద్ధం రివ్యూ రేటింగ్

నాని కృష్ణార్జున యుద్ధం రివ్యూ రేటింగ్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఈ ఇయర్ మొదటి సినిమా కృష్ణార్జున యుద్ధంతో వస్తున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సన్షైన్ మూవీస్ బ్యానర్లో తెరకెక్కింది. నాని డ్యుయల్ రోల్ చేయగా అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ హీరోయిన్స్ గా నటించారు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

తిరుపతిలో ఉండే కృష్ణ (నాని) సరదాగా ఉంటాడు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాడు. అమ్మాయిలంటే దూరంగా ఉండే కృష్ణ రుక్సార్ ను చూసి ఇష్టపడతాడు. ఇక ఫారిన్ లో ఉండే అర్జున్ (నాని) ఓ రాక్ స్టార్.. అతని మంచి ప్లే బాయ్. అతనికి సుబ్బలక్ష్మి (అనుపమ) నచ్చుతుంది. కృష్ణ, అర్జున్ ఇద్దరు వారు ప్రేమించిన అమ్మాయిలను దక్కించుకునే క్రమంలో వారికి దూరం అవుతారు. ఈ క్రమంలో కృష్ణ, అర్జున్ కలుస్తారు. ఫైనల్ గా వారిద్దరు హీరోయిన్స్ ను ఎలా కాపాడుకున్నారు. అసలు హీరోయిన్స్ ను ఎవరు వారికి దూరం చేశారు అన్నదే సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

నాని ఒక్కడు ఉంటేనే తన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలో ఇద్దరు నానిలు. కృష్ణగా అమాయకత్వం, అర్జున్ గా చిలిపితనం రెండు బాగా చేశాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకుని నడిపించాడు. ఇక హీరోయిన్స్ అనుపమ, రుక్సార్ లు కూడా ఇంప్రెస్ చేశారు. బ్రహ్మానితో పాటుగా ఫన్ బకెట్ మహేష్ జిట్టా మరికొంతమంది బాగానే చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. తిరుపతి లొకేషన్స్ లో బాగా తీశారు. ఫారిన్ లొకేషన్స్ కూడా బాగున్నాయి. సినిమా అందంగా వచ్చేందుకు కెమెరా వర్క్ చాలా బాగుంది. హిప్ హాప్ తమిజ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించడం లేదు. మేర్లపాక గాంధి కథ కథనాల్లో మళ్లీ ప్రేక్షకుల మెప్పుపొందేలా ప్రతిభ చూపించాడు.

విశ్లేషణ :

లాస్ట్ ఇయర్ ఎం.సి.ఏ తో హిట్ అందుకున్న నాని కృష్ణార్జున యుద్ధంతో ఈ ఇయర్ కు శుభారంభం పలకాలని అనుకుంటున్నాడు. కృష్ణా, అర్జున్ రెండు పాత్రల్లో వేరియేషన్స్ బాగా చేశాడు. సినిమా మొత్తం నాని వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మేర్లపాక గాంధి కథ కథనాలు సినిమా ప్లస్సులు. అయితే కథలో అంత దమ్ము లేకపోవడం కాస్త అసంతృప్తిగా అనిపిస్తుంది.

రెండు పార్లర్ గా తీసుకెళ్లిన విధానం కూడా కుదరలేదు. ఎంటర్టైనింగ్ మోడ్ లో ఆలోచిస్తే ఓకే సినిమా ఫన్ ఫుల్డ్ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. దర్శకుడు ఇదవరకు తీసిన ఎక్స్ ప్రెస్ సినిమాల ఫ్లేవరే ఈ సినిమాలో చూపించాడు. కథ మరి అంత థ్రిల్ అనిపించేలా ఉండదు. కథనం మాత్రం ఎక్కడ బోర్ కొట్టించకుండా తీసుకెళ్లాడు.

నాని సక్సెస్ మేనియాను ఈ సినిమా కూడా కొనసాగిస్తుందని చెప్పొచ్చు. యూత్, ఫ్యామిలీ, మాస్ ఇలా అన్ని వర్గాల వారికి నచ్చే సినిమా కృష్ణార్జున యుద్ధం.

ప్లస్ పాయింట్స్ :

నాని & నాని

హీరోయిన్స్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

ఎంటర్టైనింగ్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

అక్కడక్కడ ల్యాగ్ అవడం

బాటం లైన్ : కృష్ణార్జున యుద్ధం.. నాని ఖాతాలో మరో హిట్..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news