Gossipsనాని ఒకే సారి డబుల్ చేశాడు.. రిస్క్ లో పడ్డట్టే..!

నాని ఒకే సారి డబుల్ చేశాడు.. రిస్క్ లో పడ్డట్టే..!

స్టార్ హీరోలు కూడా అందుకోలేని వరుస విజయాలను అందుకుంటూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు నాచురల్ స్టార్ నాని. రీసెంట్ గా వచిన ఎం.సి.ఏ సినిమా కూడా హిట్ కొట్టడంతో నాని క్రేజ్ మరింత పెరిగిందని తెలుస్తుంది. నాని సినిమా అంటే హిట్ అన్నట్టే లెక్క అని మొన్నామధ్య రాజమౌళినే అనడం తెలిసిందే. అయితే ఈ క్రమంలో నాని తన రెమ్యునరేషన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు.

మొన్నటిదాకా చిన్న బడ్జెట్ నిర్మాతలకు అందుబాటులో ఉన్న నాని ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్స్ కు మాత్రమే అన్న తీరున ప్రవర్తిస్తున్నాడట. అలా ఎందుకు అంటే.. ఈమధ్యనే మైత్రి మూవీ మేకర్స్ నానితో సినిమాకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం సినిమాకు 5 తీసుకుంటున్న నాని హిట్లు పడుతున్నాయి కాబట్టి మరో 1, 2 పెంచితే ఓకే కాని ఏకంగా రెమ్యునరేషన్ డబుల్ చేశాడట.

ఏకంగా 10 కోట్లు రెమ్యునరేషన్ అడిగి మైత్రి మూవీ మేకర్స్ కు షాక్ ఇచ్చాడట నాని. మైత్రి మేకర్స్ వరకు ఈ బడ్జెట్ పెట్టడం ఓకే కాని ఆ తర్వాత నానికి వచ్చే నిర్మాతలు తనని మోయగలుగుతారా లేదా అన్నది ఆలోచించాలి. తనకు ఈ రేంజ్ ఇమేజ్ తెచ్చి పెట్టిన చిన్న నిర్మాతల గురించి నాని ఆలోచిస్తే బెటర్. ఈమధ్య అ! సినిమాతో నిర్మాత కష్టాలు తెలిసాయి అని చెప్పుకొచ్చిన నాని రెమ్యునరేషన్ ఇలా డబుల్ చేయడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news