Gossipsనాని బాలీవుడ్ ఎంట్రీ పై షాకింగ్ న్యూస్

నాని బాలీవుడ్ ఎంట్రీ పై షాకింగ్ న్యూస్

ఏమాత్రం హడావుడి లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోలకే పోటీ ఇస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని. ఆయన్ని చూస్తే అసలు హీరో లా బిల్డప్ కనిపించదు మన పక్కింటి కుర్రవాడే గుర్తుకొస్తాడు. అంతగా జనం మనస్సులో మమేకం అయిపోయాడు ఈ పకింటి కుర్రోడు.
నాని సినిమా పోటీలో ఉందంటే పెద్ద హీరోలకే కంగారు పుట్టేస్తుంది. నాని సినిమా అంటే డబ్బులు గ్యారంటీ అని నిర్మాతలకు కూడా నమ్మకం కలగడంతో ఇతగాడికి తిరుగే లేకుండా పోయింది.

మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం తో ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. అయితే ఓ పక్క వరుస చిత్రాల్లో హీరోగా సక్సెస్ లు అందుకుంటూనే, మరో పక్క నిర్మాణ రంగం లో అడుగుపెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఈ యాంగ్ హీరో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు ఫిలిం నగర్ లో చెక్కెర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలపై నాని స్పందిస్తూ…ఎస్వీ రంగారావు, ప్రకాష్ రాజ్ లాంటి నటులంతా ఇతర భాషల్లో కూడా బాగా పట్టున్నవారు కాబట్టి వాళ్ళు చేస్తే చూశారు. కానీ నాకు అంతా సీన్ లేదు కదా మనకి తెలుగు తేరా తప్ప మిగతా ఏదీ సూట్ కాదు అంటూ ఒక్క ముక్కలో తేల్చేసాడు. తెలుగు ఇండ్రస్ట్రీ లో ఉన్నంత కంఫర్ట్ ఇంకా ఎక్కడా నాకు దొరకదు అంటూ సమాధానం చెప్తున్నాడు ఈ న్యాచురల్ స్టార్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news