Gossipsనివేదా హీరోయినే కాని రొమాన్స్ షాలినితోనట..!

నివేదా హీరోయినే కాని రొమాన్స్ షాలినితోనట..!

జెంటిల్మన్ సినిమాతో టాలీవుడ్ రంగప్రవేశం చేసిన మళయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ ఆ సినిమా తర్వాత అదే హీరోతో నిన్ను కోరి తీసి హిట్ అందుకుంది. ఇక ఎన్.టి.ఆర్ జై లవ కుశ లో కూడా మంచి పాత్రలో నటించిన నివేదా కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ కళ్యాణ్ రాం సినిమా చేస్తుంది. కెవి గుహన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రాం హీరోగా నటిస్తున్నాడు.

నివేదాతో పాటుగా ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే కూడా నటిస్తుందని తెలుస్తుంది. అయితే సినిమాలో నివేదా స్పెషల్ రోల్ చేస్తుందట. హీరోతో రొమాన్స్ చేసేది షాలినినే అట.. నివేదా మాత్రం హీరోయినే కాదు అతనికి జోడెగా కాదని తెలుస్తుంది. రీసెంట్ గా ఎం.ఎల్.ఏ సినిమాతో వచ్చిన కళ్యాణ్ రాం మే నెలలో నా నువ్వే సినిమాతో రాబోతున్నాడు.

ఇద్దరు హీరోయిన్స్ తో కళ్యాణ్ రాం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. నిన్న లాంచ్ అయిన ఈ సినిమా ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పాల్గొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news