Gossipsఎమ్మెల్యే గా పోటీ చేయనున్న నందమూరి కళ్యాణ్ రామ్!!

ఎమ్మెల్యే గా పోటీ చేయనున్న నందమూరి కళ్యాణ్ రామ్!!

ఎమ్మెల్యే గా పోటీ చేయనున్న నందమూరి కళ్యాణ్ రామ్!! ఏంటి టైటిల్ చూసి నిజ రాజకీయాల్లో అనుకున్నారా? కాదండి తన కొత్త సినిమా కోసం ఎంపీ తో ఛాలెంజ్ చేసి మరీ ఎమ్మెల్యే గా పోటీ చేయనున్నాడట. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఇజం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అప్పటినుండి నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. వెరైటీ గా కంప్లీట్ కామెడీ సినిమా చేస్తున్నాడని ఆమధ్య రూమర్లు బాగా వినిపించాయి. అయితే ఇంకా ఏ సినిమా కూడా ఫైనల్ కాలేదు.ఈ లోపులో తన నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ చిత్రం జై లవ కుశ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఉపేంద్ర చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చిందంట.దాదాపుగా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడంట.ఇది పూర్తి స్థాయి కామెడీ సినిమా అంట. ఎంపీ తో ఛాలెంజ్ చేసి ఎమ్మెల్యే గా గెలిచే కథ ని చాలా ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్ల తో తెరకెక్కించనున్నారంట. పటాస్ లో తనలోని కామెడీ యాంగిల్ ని రుచి చూపించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో కామెడీ సినిమా చెయ్యబోతున్నాడు. ఇక శ్రీను వైట్ల తరహా కితకితలు కూడా ఈ సినిమాలో ఉంటాయంట. చూద్దాం ఈ సినిమా ఎప్పుడు పట్టాలమీదకు వస్తుందో!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news