Moviesఅసిస్టెంట్ గూబ పగలగొట్టిన బాలయ్య.... ( వీడియో)

అసిస్టెంట్ గూబ పగలగొట్టిన బాలయ్య…. ( వీడియో)

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి తన సహజత్వాన్ని చూయిస్తూ కెమెరా కంటికి చిక్కారు. బాలయ్య తన 102వ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరా కంటపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో ఇవ్వాళ జరిగిన తన 102వ సినిమా ప్రారంభోత్స కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు. బాలకృష్ణ, దర్శకుడు కేయస్ రవికుమార్ మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పుతున్న దృశ్యం వీడియోల్లో ఉంది.

ఇలా జరుగుతున్నా మరోపక్క పక్కన ఉన్న మిగతా సభ్యులు నవ్వడం కొసమెరుపు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తన 101వ సినిమా పైసా వసూల్ షూటింగ్ పూర్తి చేసిన బాలయ్య తన 102వ సినిమా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రారంభించారు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news