Newsఒక్కరోజులో దేశాన్ని బాగుచేసే సి.ఎం.. నాకు నేనే సినిమా సంచలనం..!

ఒక్కరోజులో దేశాన్ని బాగుచేసే సి.ఎం.. నాకు నేనే సినిమా సంచలనం..!

ప్రజల చేత ఎన్నుకునే ప్రజానాయకులే దేశాన్ని దోచుకుతుంటూ దేశ వినాశకానికి నాంధి పలికితే ఎలా.. వాళ్లల్లో మార్పు తెచ్చేందుకు ఒక్కరోజులో దేశాన్ని బాగుచేయడానికి వస్తున్నాడు నాకు నేనే (తోపు-తురుం). ఈ నెల 28న రిలీజ్ అవనున్న ఈ సినిమా ట్రైలర్ సృష్టించిన సంచలనాలు తెలిసిందే. నిజాయితీ గల ఎం.ఎల్.ఏ గా ఆ తర్వాత సి.ఎం గా ఎదిగిన ఓ పొరుడు ప్రజల కోసం ఏం చేశాడు అన్న కథాంశంతో వస్తున్న సినిమా నాకు నేనే.

సి.ఎంగా ఉన్నా సగటు మనిషిలా జీవనం సాగించడంతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పూనుకున్నాడు. కేవలం ఇది రాజకీయ నాయకుల కోసమే కాదు సగటు తన బాధ్యతాలను విస్మయిస్తున్నాడనే కోణంలో కూడా కథాంశం చెప్పబడిందట. రిలీజ్ కు ముందే టీజర్ ట్రైలర్ లతో ముఖ్యంగా డైలాగులే బ్రహ్మాస్త్రంగా వస్తున్న నాకు నేనే (తోపు-తురుం) ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.

మొదటి ప్రయత్నంగా జాతీని మేలుకొలిపే సినిమా చేసిన ఈ చిత్ర దర్శక నిర్మాతలకు ముందు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి సినిమా ప్రేక్షకుల చేత ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news