Moviesసంచలనం సృష్టిస్తున్న నాకు నేనే పోస్టర్

సంచలనం సృష్టిస్తున్న నాకు నేనే పోస్టర్

తొలి ప్రయత్నంగా సాదా సీదా సినిమా తీస్తే ఎలా.. అనుకున్నారో ఏమో కాని నాకు నేనే (తోపు-తురుం) రిలీజ్ కు ముందే సంచలనాలను సృష్టిస్తుంది. ఈ నెల చివరన(28 వ తారీఖున) రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో కథాంశాలు ఇప్పటికే ఆడియెన్స్ లో ఓ క్యూరియాసిటీని పెంచాయి. హీరో సి.ఎం అవడం డ్రగ్స్, గంజాయి, వ్యభిచారం లాంటి ప్రత్యేక పథకాలను నేరుగా ప్రజలకు అందేలా చూడటం వంటివి సినిమాలో ప్రధాన అంశాలు.

అసలు అంతుచిక్కని ఈ కథ చూసి సెన్సార్ వాళ్లే శభాష్ అను వెన్ను తట్టారు. ఆ ధైర్యంతోనే ఇంకాస్త ప్రమోషన్స్ పెంచిన నాకు నేనే టీమ్ ఈ నెల 28న రిలీజ్ హంగామా స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా మీద డిస్కషన్స్ జరగడం విశేషం. పొలిటికల్ సెటైర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ గా నడుస్తున్న వ్యవహారం సరిగ్గా ఇదే టైంలో ఈ సినిమా రిలీజ్ అవడం యాదృచ్చికమే అయినా నాకు నేనే (తోపు-తురుం) తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుందని చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news