Reviewsనాగ శౌర్య, షామిలి ల "అమ్మమ్మగారిల్లు" రివ్యూ & రేటింగ్

నాగ శౌర్య, షామిలి ల “అమ్మమ్మగారిల్లు” రివ్యూ & రేటింగ్

యువ హీరో నాగ శౌర్య, షామిలి లీడ్ రోల్ గా నటించిన సినిమా అమ్మమ్మగారిల్లు. సుందర్ సూర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రాజేష్ నిర్మించారు. కళ్యాణ్ రమణ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి ఈ సమీక్షలో చూద్దాం.

కథ :

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం ఊరిలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఫ్యామిలీలో పెద్ద కొడుకు రవి బాబు (రావు రమేష్) ఆస్థి పంచుకుని సిటీకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఉమ్మడిగా ఉన్న కుటుంబం విడిపోవడం ఇష్టం లేని ఇంటి పెద్ద మనిషి చనిపోతాడు. ఇక ఇంట్లో ఉన్నవారంతే ఎవరి దారి వారు చూసుకుంటారు. ఇక పెద్ద ఇంట్లో కేవలం ఒక బామ్మ మాత్రమే ఉంటుంది. అయితే ఈ టైంలో మనవడుతో కలిసి అమ్మమ్మ తన ఉమ్మడి కుటుంబ కోరిక ఎలా తీర్చుకుంది అన్నదే సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

నాగ శౌర్య నటన బాగుంది. సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశాడు. హీరోయిన్ షామిలి కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించింది. రావు రమేష్ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించాడు. సినిమాలో ఆయన సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. ఇక షకలక శంకర్ కామెడీ కూదా అలరితుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే అక్కడక్కడ కాస్త అటు ఇటుగా ఉంటుంది. కళ్యాణ్ రమణి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. రెండు పాటలు బాగున్నాయి. రాజేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు సుందర్ సూర్య కథ కథనాల్లో ఇంకాస్త ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లో కొన్ని చోట్ల మనసుని తాకే ప్రయత్నం చేసినా అనుకున్న విధంగా తీయలేకపోయాడు.

విశ్లేషణ :

అమ్మగారిల్లు సినిమా టైటిలే చాలా ఆహ్లాదకరంగా ఉంది. సకుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా ఇది వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించడం తప్పు. ఇక రాసుకున్న కథను ఎంతసేపు ప్రేక్షకుల మనసును తాకేలా చేయడమే దర్శకుడి పని.

ఈ విషయంలో డైరక్టర్ కొన్ని పొరపాట్లు చేశాడు. పాత్రలను బట్టి వారి మధ్య సందర్భం ఇరికించినట్టు ఉంటుంది. ఎమోషనల్ గా వర్క్ అవుట్ అయ్యేలా అనిపించిన సీన్స్ పేలవంగా నడిపించాడు. కచ్చితంగా ఈ సినిమాను ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే శతమానం భవతిలా అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించేలా చేస్తుంది.

కాస్టింగ్ హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. యువ హీరోగా మంచి ఫాం లో ఉన్న నాగ శౌర్య కెరియర్ లో ఇంత భారీ ఎమోషనల్ మూవీ చేయడం గొప్ప విషయమే కాని దానికి తగిన ప్రతిఫలం రాలేదు.

ప్లస్ పాయింట్స్ :

నాగ శౌర్య

రావు రమేష్

కథ

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

సాగదీసిన స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

అమ్మమ్మగారిల్లు.. ఇంప్రెస్ చేయలేకపోయింది..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news