Moviesఛలో మొదటి రోజు కలెక్షన్లు..!

ఛలో మొదటి రోజు కలెక్షన్లు..!

యువ హీరో నాగ శౌర్య, కన్నడ భామ రష్మిక లీడ్ పెయిర్ గా నటించిన సినిమా ఛలో. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా అలరిస్తుంది. సినిమా కథలో అంత దమ్ము లేకున్నా సరే దర్శకుడు కథనం నడిపించిన తీరు ఆకట్టుకుంది. రవితేజ టచ్ చేసి చూడు సినిమాకు పోటీగా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా మొదటి రోజు ఆదాపు 60 శాతం ఆక్యుపెన్సీ సాధించిందని తెలుస్తుంది. చూస్తుంటే సినిమాకు 2 నుండి 2.5 కోట్ల దాకా షేర్ వచ్చినట్టు తెలుస్తుంది. అఫిషియల్ గా ఎంత వసూళ్లను రాబట్టింది అన్నది తెలియాల్సి ఉంది. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి కచ్చితంగా సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని తెలుస్తుంది.challo poster

ఇక మరో వారంలో సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, మోహన్ బాబు సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వారంలోనే ఛలో సేఫ్ జోనర్ లోకి వచ్చేయాలి. కలక్షన్స్ జోష్ చూస్తుంటే సినిమా లాభాలు తెచ్చేలా లానే ఉంది.

Chalo Movie HD Photos Stills | Naga Shourya, Rashmika Mandanna Images, Gallery
Chalo Movie HD Photos Stills | Naga Shourya, Rashmika Mandanna Images, Gallery

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news