‘ఖైదీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రాంగోపాల్ వర్మని ఉతికి పారేసిన నాగబాబు

nagababu sensational comments on ram gopal varma in khaidi pre release event

Mega brother Nagababu made sensational comments on Ram Gopal Varma in Khaidi No 150 pre release event for making controversial tweets on his brother Chiranjeevi.

శనివారం (07-01-2017) సాయంత్రం హాయ్‌లాండ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాబ్రదర్ నాగబాబు వీరోచిత వ్యాఖ్యలు చేశారు. అన్నయ్య చిరంజీవి సినిమాపై ఎవరైతే విమర్శలు చేశారో.. వాళ్ళని ఏకిపారేశాడు. తొలుత చిరు రీమేక్ చిత్రం ఎంచుకోవడంపై కామెంట్స్ చేసిన వారికి సింగిల్ లైన్‌లో ఆన్సర్ ఇచ్చాడు. ‘చాలామంది చిరు రీమేక్ చేయడమేంటి? స్ట్రెయిట్ మూవీ చేయొచ్చు కదా? అని అంటున్నారు. రీమేక్ చేస్తే తప్పేంటో నాకు అర్ధం కావడం లేదు. చిరు మాత్రమే కాదు.. చరణ్, పవన్, అందరూ రీమేక్‌లు చేశారు. దాంట్లో తప్పేం లేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మనైతే తన కామెంట్లతో ఉతికిపారేశాడు నాగబాబు.

‘ఈమధ్యకాలంలో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోయిన ఒకడు రకరకాల కూతలు కూస్తున్నాడు. వాడికి కుయ్యడం తప్ప.. పని రావట్లేదు. ఆ కూతలు ఆపేసి, దర్శకత్వం సరిగ్గా చేసుకుని, ఆ బాంబ్ ఏదో ముంబైలోనే కాల్చుకుంటే.. అతనితోపాటు, మాకూ మంచిది. అక్కడ తన పని చూసుకోకుండా.. చిరంజీవి సినిమా ఎలా ఉండాలి, ఎలా యాక్ట్ చేయాలి.. అంటూ వాడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి కూసే కూతలు మాకేం కావు. మేము చాలా కష్టపడి కిందనుంచి పైకి వచ్చినవాళ్లమే. అతనిలా అడ్డదారిలో డైరక్టర్ అవ్వలేదు. ఆన్ లైన్లో రకరకాలు కూతలు కూస్తున్నాడు. ముందు నువ్వు సినిమాలు సరిగ్గా చేయడం నేర్చుకో. ఒకప్పుడు బాగా తీసేవాడివి కానీ ఇప్పుడు నీ స్టాండర్డ్ పడిపోయింది. తిరిగి బాగా చేయడానికి ప్రాక్టీస్ చెయ్. పక్షి కూతలు ఎన్నికూసినా.. ఒక సూపర్ హిట్ సినిమాను తొక్కలేవు.. ఫెయిల్యూర్ సినిమాను లేపలేవు’ అంటూ వర్మపై నాగబాబు బాంబ్ పేల్చాడు.

ఈ విధంగా తనపై నాగబాబు వీరోచిత కామెంట్లు చేయడంతో.. రాంగోపాల్ వర్మ స్పందించాడు. ‘నాగబాబు గారు.. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్‌లో అందరిమీద, అన్నింటిమీద ఏదో ఒక ఒపీనియర్ చెబుతూ ఉంటాను. కేవలం మీ ఫ్యామిలీ మీదే కాదు. నా ట్వీట్లు మోడీ నుంచి బచ్చన్‌గారి వరకు చివరికి నా మీద నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ.. నా ట్వీట్లతో మీరు హర్ట్ అయ్యారని తెలిసింది కనుక నేను చాలా జెన్యూన్‌గా మీకు, మీ ఫ్యామిలీకి సారీ చెబుతున్నా. నా ఉద్దేశం వేరే అయినా.. మీరు హర్ట్ అయ్యారు కాబట్టి చిరుకి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థ్యాంక్స్’ అని క్షమాపణలు చెప్పుకున్నాడు.

More from my site