Newsనా అన్న, తమ్ముడి జోలికొస్తే.. అది వర్మైనా.. ఎవరైనా సరే.. వాళ్ల...

నా అన్న, తమ్ముడి జోలికొస్తే.. అది వర్మైనా.. ఎవరైనా సరే.. వాళ్ల సంగతి తేలుస్తా : నాగబాబు

Finally, megabrother Nagababu responds on Ram Gopal Varma controversial tweets in a latest interview.

‘ఖైదీ నెంబర్ 150’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాబ్రదర్ నాగబాబు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై వీరోచిత కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు వర్మ కూడా తనదైన శైలిలో ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డాడు. ‘నాగబాబు గారు.. నా మీద కామెంట్స్ చేయడానికి ముందు మీ ‘జబర్దస్త్’ కెరీర్ ఎలాగుందో ఓసారి చూసుకోండి. నా కెరీర్ వల్ల ఎన్నో ఫ్యామిలీస్ రన్ అవుతున్నాయి.. మీ కెరీర్ అన్నయ్య చిరు మీదే ఆధారపడి ఉంది’అంటూ వర్మ వివాదాస్పద ట్వీట్స్ చేశాడు. వాటిపై నాగబాబు నుంచి కూడా వెంటనే కౌంటర్ వస్తుందని అనుకున్నారు కానీ.. అలా జరగలేదు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు? అని అనుకుంటున్న తరుణంలో.. చివరికి వర్మ వ్యాఖ్యలపై స్పందించారు.

‘ట్విటర్‌లో వర్మ నాపై చేసిన కామెంట్స్‌కి నాకు చాలా సంతోషమే. ఆయన చెప్పినట్లుగా నేను మా అన్న చిరంజీవిపై ఆధారపడి బ్రతుకుతున్నాను. అయినా.. ఇందులో తప్పేముంది. నేను మా అన్నయ్యే వద్దే అడుక్కుంటున్నాను కానీ.. ఊరోళ్లమీద పడి బ్రతకడం లేదు కదా’ అంటూ నవ్వుతూ ఎదురు ప్రశ్న వేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అన్నయ్యతో పోల్చుకుంటే తానేమీ కాదని.. తమ మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. వర్మ ట్వీట్లను చదివినప్పుడు తాను నవ్వుకున్నానని అన్నారు. తనను ఎవరేమన్నా పట్టించుకోనని చెప్పిన నాగబాబు.. తన అన్న చిరు, తమ్ముడు పవన్‌ని ఏమైనా అంటే మాత్రం తాను బ్యాలెన్స్ కోల్పోతానని, అదే తన వీక్‌నెస్ అని వెల్లడించారు.

ఇదే సమయంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వర్మపై చేసిన వ్యాఖ్యలపై నాగబాబు మాట్లాడారు. తాను ఆరోజు కావాలనే అలా మాట్లాడానని, తమపై కొందరు రాళ్లు వేసినప్పుడు అందుకు తాము కూడా ఒక రాయి వేయాలని.. లేకపోతే అది తప్పవుతుందని చెప్పారు. చిరు, పవన్‌పై ఎవరేమన్నా.. తాను ఇలాగే స్పందిస్తానని అన్నారు. నిజానికి.. వర్మ చాలా గొప్ప దర్శకుడని, తెలుగువారి సత్తాను ముంబైలో చాటిచెప్పి, ఉత్తర భారతీయులకు ఒక గొప్ప పాఠం నేర్పాడని అన్నారు. కానీ.. గత ఐదారేళ్ల నుంచి ఆయన మెగా ఫ్యామిలీని కెలుకుతున్నారని, అది తనకు నచ్చలేదని తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ కాస్త బెగ్గర్ సింగ్ అయిందని వర్మ అనడం తప్పని.. చిరంజీవి గెటప్‌ను జేమ్స్ కామరూన్ చూస్తే అతడు ఆశ్చర్యపోతాడని వెటకారం చేయడం సరికాదని నాగబాబు అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news