Gossipsబాలయ్య టైటిల్ నే కొట్టేసిన యంగ్ హీరో..

బాలయ్య టైటిల్ నే కొట్టేసిన యంగ్ హీరో..

చిత్రం భ‌ళారే విచిత్రం అయ్యారే విచిత్రం అంటే ఇదే!
బాల‌య్య బాబు టైటిల్‌తో ఓ యంగ్ హీరో సినిమా చేయ‌నున్నాడ‌ని
టాలీవుడ్ టాక్‌. ఆ చిత్రం ఏంటంటే..?

సినిమాల మీద ఇష్టంతో ఏలూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన నాగశౌర్య తాజాగా వార్తల్లోకి వచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోల్లో ఒకరైన బాలయ్య మనసు పడిన ఒక టైటిల్.. ఇప్పుడీ యంగ్ హీరో సొంతమైందన్న వార్త ఆసక్తికరంగా మారింది. బాలయ్య నటించాలని ఎంతో ఆశపడ్డ మూవీగా నర్తనశాలను చెప్పాలి. తన తండ్రి నటించిన ఈ చిత్రానికి రీమేక్ చేయాలని.. ఈ చిత్రంలో ద్రౌపతి పాత్రకు దివంగత నటి సౌందర్యను మొ దట అనుకున్నారు. కారణాలు ఏమైనా ఆ చిత్రం పట్టాల మీదకు ఎక్కలేదు. బాలయ్య వందో సినిమాగా నర్తనశాల పేరు చర్చకు వచ్చింది.ఈ సంద ర్భంగా ద్రౌపతిపాత్రకు నయన తార చేత చేయించాలన్న ఆలోచన చేసినట్లు చెబుతారు.అయితే.. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రాజెక్టు తెర మీదకు రావ టంతో నర్తనశాల వెనక్కి వెళ్లింది. తాజాగా ఈ చిత్ర టైటిల్ యంగ్ హీరో నాగశౌర్య చేతుల్లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ నర్తనశాల పౌరా ణికం కాదని.. సమకాలీన అంశాలతో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఎంతగానో మనసు పడిన సినిమా టైటిల్.. యంగ్ హీరో సినిమా కి ఖ‌రారు చేయడం ఇప్పుడో ఆస‌క్తిదాయ‌క‌ప‌రిణామం. కాగా నాగ‌శౌర్య హీరోగా చ‌లో అనే సినిమా చేస్తున్నాడు.త్వ‌ర‌లోనే ఇది విడుద‌ల‌కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news