Movies‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఊహించని రీతిలో..

‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఊహించని రీతిలో..

Naga Chaitanya’s latest film Saahasam Swasaga Sagipo has done well at the box office in it’s first weekend run around the world. After that the result is totally different. The collections dropped in huge amount which is disappointing distributor along with movie unit. If this continues for some time commercially this movie will flop. Let’s see the final result.

‘ప్రేమమ్’తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగచైతన్య.. ‘సాహసం శ్వాసగా సాగిపో’ మూవీతోనూ అదే జోరు కొనసాగిస్తాడని భావించారు. పైగా.. భారీ అంచనాల మధ్యే విడుదల అవ్వడంతో మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేశారు. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, దాని ప్రభావం విపరీతంగా ఉందని తెలిసినప్పటికీ.. తమ చిత్రంపై నెలకొన్న క్రేజ్, కంటెంట్ మీదున్న నమ్మకంతో సంతృప్తికరమైన వసూళ్లైనా రాబడుతుందని రిలీజ్ చేశారు. అనుకున్నట్లుగానే ఫస్ట్ వీకెండ్‌లో ఫర్వాలేదనిపించే కలెక్షన్స్‌ని ఈ చిత్రం కలెక్ట్ చేసింది. కానీ.. వీకెండ్ తర్వాత మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నోట్ల కొరత ఎఫెక్ట్ బాగా చూపడంతో.. ఊహించని రీతిలో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్‌వైడ్‌గా రూ.5 కోట్లపైనా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, ఆ తర్వాత నాలుగు రోజుల్లో కేవలం కోటిన్నరే కలెక్ట్ చేసింది. ఆ లెక్కలన్నీ కలుపుకుంటే.. మొత్తం 7 రోజుల్లో ఈ చిత్రం రూ. 6.65 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి మూడురోజుల్లో మంచి వసూళ్ళు రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు ఆశలు రేకెత్తించిన ఈ చిత్రం.. ఆ తర్వాత తక్కువ కలెక్షన్లతో వారికి నిరాశే మిగిల్చింది. తొలిరోజు మిక్స్‌డ్ టాక్ రావడంతోపాటు నోట్ల రద్దు ప్రభావం వల్లే ఈ చిత్రం కలెక్షన్స్ వీక్ డేస్‌లలో ఇంత దారుణంగా పడిపోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా అయితే.. టోటల్ రన్‌లో బ్రేక్ ఈవెన్‌కి చేరుకోవడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.

ఏరియాల వారీగా ఏడు రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 2.15
సీడెడ్ : 0.55
వైజాగ్ : 0.46
గుంటూరు : 0.40
కృష్ణా : 0.33
ఈస్ట్ గోదావరి : 0.33
వెస్ట్ గోదావరి : 0.20
నెల్లూరు : 0.16
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 4.58 కోట్లు
ఇక యూఎస్ఏ ($270K), కర్ణాటక (90 లక్షలు), రెస్టాఫ్ ఇండియా (25 లక్షలు) ఏరియాలన్ని కలుపుకుని.. ఈ చిత్రం రూ.6.65 కోట్లు కలెక్ట్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news