Gossipsరెండో సినిమా కూడా పోగొడతావా...అని అఖిల్ పై నాగ్ ఫైర్

రెండో సినిమా కూడా పోగొడతావా…అని అఖిల్ పై నాగ్ ఫైర్

అక్కినేని అఖిల్ తన చిన్నతనంలోనే సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అఖిల్ సినిమాల్లో అరంగేట్రం చేయకముందే అతని పై బారి అంచనాలు నెలకొన్నాయి. అదే అంచనాలతో అఖిల్ సినిమాలో నటించి ఆ ఆంచనాలను తారుమారు చేశారు. అఖిల్ మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం అఖిల్ తనకి అంతగా అనుభవం లేకపోయినా సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లో కలగా చేసుకున్నాడనే వార్త అప్పట్లో వినిపించింది.

వి.వి. వినాయక్ లాంటి అనుభవం గల దర్శకుడికి సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన అన్ని నిర్ణయాలు అఖిల్ తీసుకున్నాడని సమాచారం. అఖిల్ మూవీకి కథ సరిగ్గా లేదని అందరూ భావించిన అఖిల్ మాత్రం తనకి అదే స్టోరీ లైన్ కావాలని పట్టుబట్టడట. ఆ సినిమా ప్లాప్ గ మిగిలిపోవటంతో తండ్రి నాగార్జున కి తన కుమారుడి రెండవ సినిమా పట్టాలెక్కించటానికి చాల సమయమే పట్టింది. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి ఘన విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్ తో హలో సినిమాని పట్టాలేకించాడు నాగార్జున. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అఖిల్ జోక్యం చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. సినిమా మ్యూజిక్ దగ్గర నుండి ఫైట్స్ వరకు అన్నిట్లో అఖిల్ వెలుపెడుతున్నాడట. అయితే ఇప్పుడు విక్రమ్ డైరెక్షన్ విషయంలో అఖిల్ కలగచేసుకోవటం తో కోపం తెచ్చుకున్న విక్రమ్ వెంటనే నాగార్జునకు కంప్లేంట్ చేసాడని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త.

డిసెంబర్‌ 22న ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేయడంతో షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ అఖిల్ తన పని తాను చేయకుండా మిగిత వాటిలో కూడా వేలు పెట్టడం వలన, సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయటం కష్టం అని సమాచారం. ఈ విషయం తెలుసుకున్ననాగార్జున అఖిల్ పై కోపం తో రెండో సినిమాని కూడా ప్లాప్ చేస్తావా అని నాగార్జున అన్నారని ఇండస్ట్రీ లో గుసగుసలు. ఆ తరువాత అఖిల్ తో చర్చించి సినిమా కి సంబంధించిన మిగిలిన విభాగాల్లో కలగచేసుకోవద్దని, విక్రమ్ దర్శకత్వం లో వేలు పెట్టొద్దని కేవలం ని పార్ట్ వరకు షూట్ చేసుకో అని చెప్పాడని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news