Gossipsరిలీజ్ కి ముందే టెన్షన్ లో ప్రొడ్యూసర్స్..

రిలీజ్ కి ముందే టెన్షన్ లో ప్రొడ్యూసర్స్..

రైటర్ గా ఉన్న వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన సినిమా నా పేరు సూర్య. అల్లు అర్జున్ యాంగ్రీ సోల్జర్ గా కనిపిస్తున్న ఈ సినిమాకు మొదటి నుండి టైం అసలు కలిసి రావట్లేదు. సెన్సార్ నుండి కూడా మిక్సెడ్ టాక్ రావడంతో సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్న టాక్ నడుస్తుంది.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని నా పేరు సూర్య సినిమాతో కూడా కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే సినిమాకు అంత మంచి బజ్ లేదన్నది వినిపిస్తున్న మాట. టీజర్, ట్రైలర్ లతో ఇంప్రెస్ చేసినా సినిమాపై కుట్ర అని అల్లు అరవింద్ రివర్స్ స్ట్రాటజీ బన్ని సినిమా మీద ఎఫెక్ట్ పడ్డది.

ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు అన్న ఆలోచనలో కూడా సినిమాపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సినిమా యూనిట్ మాత్రం హిట్ పక్కా అంటూ బలంగా చెబుతుంటే బయట టాక్ మాత్రం వేరేలా ఉంది. మరి అసలు రిజల్ట్ ఏంటన్నది 24 గంటల్లో తెలిసిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news