Gossips" నా పేరు సూర్య " ప్రీ - రివ్యూ

” నా పేరు సూర్య ” ప్రీ – రివ్యూ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. యాంగ్రీ సోల్జర్ గా బన్ని అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశాడని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా హైలెట్స్ ఎలా ఉండబోతాయి.. లోపాలను కూడా అంచనా వేసేలా ఈ నాటి ప్రివ్యూలో చూసేద్దాం.

సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తే తన కోపంతో తనపై అధికారిని కూడా కాదని నిర్ణయం తీసుకునే సూర్యని ఎప్పటికప్పుడు మందలిస్తూనే ఉంటారు. ఇక దేశ సరిహద్దుల్లోనే కాదు దేశాన్ని తమ స్వార్ధం కోసం స్వప్రయోజనాల కోసం ఆటంకం కలిగించే పని చేస్తారు కొందరు. వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు అన్నది సినిమా కథ అని చెప్పొచ్చు.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని ఈ సినిమాలో యాంగ్రీ సోల్జర్ గా కొత్త లుక్ లో కనిపించాడు. సినిమాలోని తన పాత్రకు బాగా కష్టపడినట్టు తెలుస్తుంది. స్టైలిష్ లుక్ లో బన్ని క్రేజ్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అను ఎమ్మాన్యుయెల్ అందాలు కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవనున్నాయి.

విశాల్ శేఖర్ మ్యూజిక్ స్పెషల్ గా నిలుస్తుంది. లగడపాటి శ్రీధర్ సినిమా ఖర్చుకి వెనుకాడలేదని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. స్టైలిష్ ఎంటర్టైనర్ గా రాబోతున్న నా పేరు సూర్య మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ ఇలా అందరు మెచ్చే సినిమాగా రాబోతుంది. సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news