Moviesనా పేరు సూర్య వారం రోజుల వసూళ్ల లెక్క.. హడావిడి మాత్రమేనా..!

నా పేరు సూర్య వారం రోజుల వసూళ్ల లెక్క.. హడావిడి మాత్రమేనా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన నా పేరు సూర్య సినిమా భారీ అంచనాల మధ్య మే 4న రిలీజ్ అయ్యింది. సినిమా మొదటి షో నుండి డివైడ్ టాక్ రాగా బన్ని క్రేజ్ తో ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. యాంగ్రీ సోల్జర్ గా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టినా కంటెంట్ పరంగా ఆడియెన్స్ మెప్పు పొందలేదు.

రచయితగా తన సత్తా చాటిన వక్కతం వంశీ దర్శకుడిగా మొదటి ప్రయత్నం సక్సెస్ అవలేకపోయాడు. అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా వారం రోజుల్లో 44.64 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ఏరియాల వారిగా నా పేరు సూర్య సినిమా కలక్షన్స్ వివారాలు :

నైజాం : 11.10 కోట్లు

సీడెడ్ : 5.80 కోట్లు

ఉత్తరాంధ్ర : 4.51 కోట్లు

ఈస్ట్ : 3.20 కోట్లు

వెస్ట్ : 2.47 కోట్లు

కృష్ణా : 2.32 కోట్లు

గుంటూరు :3.66 కోట్లు

నెల్లూరు : 1.37 కోట్లు

ఏపి/ తెలంగణా కలిపి 34.43 కోట్ల కలక్షన్స్ రాబట్టింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా 6.20 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 4 కోట్లు

వరల్డ్ వైడ్ గా 44.64 కోట్లు వసూళు చేసింది నా పేరు సూర్య.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news