నా నువ్వే ట్రైలర్ సరికొత్త రికార్డ్..అజ్ఞాతవాసిని తొక్కి పడేసి.. సెకండ్ ప్లేస్ లో !

naa-nuvve-trailer-records

నందమూరి హీరో కళ్యాణ్ రాం హీరోగానే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ ఫుల్. రీసెంట్ గా ఎం.ఎల్.ఏ అంటూ వచ్చి ప్రేక్షకులను అలరించిన కళ్యాణ్ రాం త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను జయేంద్ర డైరెక్ట్ చేస్తుండగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు.

సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన ఈ ట్రైలర్ 24 గంటల్లో అత్యధిక వ్యూయర్ షిప్ కలిగిన ట్రైలర్ గా సరికొత్త రికార్డ్ సృష్టించింది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా నా నువ్వే ట్రైలర్ రికార్డ్ ఉంది. ఈ సినిమా 24 గంటల్లో 7 మిలియన్ వ్యూయర్ కౌంట్ తో టాప్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

బాహుబలి సినిమా ట్రైలర్ 24 గంటల్లో 21.7 మిలియన్ వ్యూస్ సాధించగా.. అజ్ఞాతవాసి ఒక్కరోజులో 5.9 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంటే ఈ లెక్కన కళ్యాణ్ రాం నా నువ్వే ఏ రేంజ్ కు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా లవర్ బోయ్ గా కళ్యాణ్ రాం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Leave a comment