Gossipsనా పేరు సూర్య రిలీజ్ కు ముందే దారుణమైన పరిస్థితి..!

నా పేరు సూర్య రిలీజ్ కు ముందే దారుణమైన పరిస్థితి..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా సత్తా చాటాడు.

దాదాపు 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వస్తున్న నా పేరు సూర్య 80 కోట్లు తెస్తే హిట్ అన్నట్టే. అయితే బన్ని కు ఉన్న ఫాలోయింగ్ కు అది పెద్ద కష్టమేమి కాదు. మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు రిలీజ్ కు ముందే కష్టం వచ్చి పడింది. ఓ పక్క అల్లు అరవింద్ రివర్స్ స్ట్రాటజీతో సినిమాపై నెగటివ్ మార్క్ రాగా ఓ పక్క భరత్ అనే నేను మంచి వసూళ్లతోనే నడుస్తుంది.

ఇక రంగస్థలం కూడా బి,సి సెంటర్స్ లో స్టడీగానే రన్ అవుతుంది. మరో పక్క హాలీవుడ్ మూవీ ఎవెంజర్స్ కూడా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. ఇది చాలదు అన్నట్టు ఐపిఎల్ సీజన్ కూడా మొదలైంది. అసలే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి ఫాం లో ఉంది. ఇవన్ని నా పేరు సూర్యకు అడ్డుగా మారుతాయని చెప్పొచ్చు. మరి వీటన్నిటిని దాటుకుని బన్ని హిట్ కొడతాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news