Moviesతారక్ చరణ్ సినిమా అధికార ప్రకటన

తారక్ చరణ్ సినిమా అధికార ప్రకటన

బాహుబలి తర్వాత రాజమౌళి చేసే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెగా నందమూరి మల్టీస్టారర్ గా రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ తో ఆర్.ఆర్.ఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఓ చిన్న టీజర్ రిలీజ్ చేశారు. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక సినిమాగా ఉంటుందని చెప్పొచ్చు.

ముఖ్యంగా ఈ ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్ ఏమై ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆర్.ఆర్.ఆర్ అంటే రాజమౌళి, రాం చరణ్, రామారావు అయ్యుంటుందని ఊహిస్తున్నారు. మొత్తానికి కేవలం టీజర్ తోనే సినిమా అప్పీల్ ను తెలిపి భారీ అంచనాలను పెంచేశాడు జక్కన్న.

కచ్చితంగా ఈ మెగా మల్టీస్టారర్ టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోని రికార్డులను చెడుగు ఆడేయడం ఖాయమని అంటున్నారు. మరి ఈ సినిమా గురించి మరింత సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news