Moviesమహానటి మూగ మనసులు మేకింగ్ వీడియో..!

మహానటి మూగ మనసులు మేకింగ్ వీడియో..!

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని మూగ మనసులు సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. మహనాటి టైటిల్ సాంగ్ తో పాటుగా ఈ సాంగ్ విజువల్ గా కూడా గ్రాండియర్ గా అనిపిస్తుంది. మూగమనసులు అప్పట్లో సాంగ్ ఎలా షూట్ చేస్తారో అలానే ఈ పాటను షూట్ చేయడం జరిగింది.

దీని కోసం ఎంతోమంది టెక్నిషియన్స్ కష్టపడటం జరిగింది. కెమెరా వర్క్ కూడా చాలా రిస్కీగా చేశారనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. మిక్కి మార్క్ మెలోడీగా వచ్చిన ఈ సాంగ్ మేకింగ్ వీడియో అందరిని అలరిస్తుంది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ ల మధ్య వచ్చే ఈ పాట థియేటర్ లో ప్రేక్షకులను మంచి అనుభూతిని కలిగిస్తుంది.

వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన మహానటి సినిమా అంచనాలను మించి సూపర్ హిట్ అయ్యింది. బయోపిక్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న ఈ సినిమా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news