Moviesమొదటి రోజు కుమ్మేసిన ఎమ్మెల్యే..!

మొదటి రోజు కుమ్మేసిన ఎమ్మెల్యే..!

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎమ్మెల్యే. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా కళ్యాణ్ రాం మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు ఎంత రాబట్టింది అన్న దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఓపెనింగ్స్ లో కళ్యాణ్ రాం కెరియర్ లో ది బెస్ట్ అనిపించుకుంది ఎమ్మెల్యే మూవీ.

దాదాపు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 2 కోట్ల దాకా ఓపెనింగ్స్ రాబట్టిందట ఈ మూవీ. ఇక ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లనే రాబట్టిందని అంటున్నారు. ప్రీమియర్స్ తో కలుపుకు ఎమ్మెల్యే మూవీ మొదటి రోజు 3 కోట్ల దాకా వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది. కళ్యాణ్ రాం సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మణిశర్మ మ్యూజిక్ అందించారు.

ఈ సినిమా కళ్యాణ్ కెరియర్ లో మంచి హిట్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా టాక్ వచ్చినా నందమూరి ఫ్యాన్స్ ను అలరించేలా సినిమా ఉండటంతో ఇది సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఈ సినిమా వారం లో అది రాబట్టే అవకాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news