Gossipsరెచ్చిపోయిన మెహ్రీన్ ...

రెచ్చిపోయిన మెహ్రీన్ …

కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మోడల్ మెహ్రీన్ కౌర్. ఆ సినిమా సక్సెస్ వచ్చినా అది వచ్చిన సంవత్సారానికి కాని మహానుభావుడి సినిమాను ఒప్పుకుని హిట్ అందుకున్న మెహ్రీన్ కౌర్ ఈమధ్యనే మాస్ మహరాజ్ రవితేజతో నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో కూడా హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సందీప్ కిషన్ తో కేరాఫ్ సూర్య సినిమాలో నటించిన అమ్మడు సాయి ధరం తేజ్ తో జవాన్ సినిమాలో నటించింది.

సినిమాలో హాట్ గా కనిపించాలని హ్యాట్రిక్ హిట్ వచ్చాక కాని తెలియలేదనుకుంటా.. అభినయం ఓకే అనేలా ఉన్నా ఆడియెన్స్ ను అందంతో ఆకట్టుకునే భామలే ఎక్కువమంది. ఈ క్రమంలో ఇప్పుడు మెహ్రీన్ కూడా చేరింది. జవాన్ లో ఇంతకుముందు ఎన్నడు లేని హాట్ లుక్స్ తో కనబడుతుంది. ముఖ్యంగా ఓ సాంగ్ లో అమ్మడు అందాలతో అదరగొట్టేసిందని అంటున్నారు.

తన మీద వచ్చిన ఈ అటెన్షన్ ను పోనివ్వకుండా మెహ్రీన్ బాగానే ప్రయత్నాలు చేస్తుదని చెప్పొచ్చు. ఇక రానున్న జవాన్ కూడా హిట్ అయితే మాత్రం అమ్మడికి తిరుగు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో వరుస హిట్లు సాధిస్తున్న మెహ్రీన్ కోలీవుడ్ నుండి కూడా మంచి అవకాశాలే వస్తున్నాయి.  ఇలానే రెచ్చిపోతే ఇక అమ్మది ధాటికి మిగతా హీరోయిన్స్ కు కష్టమే అని చెప్పాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news