Gossipsమెహబూబా హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

మెహబూబా హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

పూరి జగన్నాథ్ దర్శక నిర్మాతగా తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన సినిమా మెహబూబా. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలోని ప్రేమకథతో వచ్చింది. అంతేకాదు పునర్జన్మల నేపథ్యం కూడా ఇందులో ఉంది. ఈ సినిమా టాక్ అటు ఇటుగా ఉండగా సినిమా మాత్రం పూరి మార్క్ టేకింగ్ తో అదరగొట్టాడని అంటున్నారు.

చాలా రోజుల తర్వాత మెహబూబాని మనసు పెట్టి తీశాడు పూరి జగన్నాథ్. అందుకే దిల్ రాజు ఈ సినిమాను కొనేశాడు. వరల్డ్ వైడ్ గా దిల్ రాజు రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రస్తుతానికి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఆకాష్ నటన, పూరి టేకింగ్ హైలెట్ కాగా.. కథ, కథనాలు కూడా కొత్తగా ఉన్నాయని అంటున్నారు.

అయితే సినిమా మొత్తం బోర్డర్ నేపథ్యంలో సాగడంతో ఆడియెన్స్ కాస్త బోర్ ఫీలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సందీపొ చౌతా మ్యూజిక్ ఓకే అన్నట్టుగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. సినిమా పూరి మార్క్ మూవీగా స్టైలిష్ గా ఉన్నా ఎంటర్టైనింగ్ విషయంలో కాస్త వెనుకపడ్డదని తెలుస్తుంది. ఓపక్క మహానటి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పూరి మెహబూబా ఆడియెన్స్ కు ఎక్కుతుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news