Gossipsఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఆ మెగా హీరో ...

ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఆ మెగా హీరో ఎవరో తెలిస్తే షాకె !!

నటనలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి ఎవ్వరూ సాటిరారనే విషయం ఎన్నోసార్లు రుజువైంది. అలాఅని ఇతర హీరోలకు నటన రాదని కాదు.. వాళ్లూ తమవంతు ది బెస్ట్ ప్రతిభే కనబరుస్తున్నారు. కాకపోతే.. ఎన్టీఆర్‌తో సరితూగలేకపోతున్నారు. ఈ విషయం వేరేవాళ్లు చెప్పడం కాదు.. స్వయంగా వాళ్లే ఒప్పుకున్నారు. తారక్‌కి మించిన నటుడు మరెవ్వరూ లేరంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. సినిమా సినిమాకి తారక్ ఒక మెట్టు ఎక్కుతున్నాడే తప్ప.. నిరాశ పరచడం లేదు. ఇక ‘జై లవకుశ’లో ఏకంగా మూడుపాత్రల్లో మెప్పించి.. అందరి చేత సెల్యూట్ కొట్టించుకున్నాడు. అమాయకుడిగా, తుంటరోడిగా, రావణుడిగా నటవిశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా.. ‘జై’ క్యారెక్టర్‌లో అతని నటనాప్రతిభకు ఎన్ని మార్కులువేసినా తక్కువే. ఒకవేళ రావణాసురుడు ఇప్పుడు పుడితే.. ‘జై’లాగే వుంటాడేమో అనేంతలా ఆ పాత్రకి ప్రాణం పోసేశాడు. అదీ.. తారక్ ప్రతిభ అంటే!

అయితే ఇప్పుడు టాలీవుడ్ బిగ్గిస్ మధ్య ఎన్టీఆర్ నట విశ్వరూపంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి . 2 రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రాంచరణ్ సైతం తన సన్నిహితుల వద్ద ఎన్టీఆర్ నటన గురించి ప్రస్తావించినట్టు సమాచారం . రామ్ చరణ్ తన నటనను మెరుగుపరుచుకుని ప్రయత్నం చేస్తున్నారు . అయన నటించిన ధ్రువ చిత్రం తో యాక్టింగ్  లో కొంచం బెటర్మెంట్ వచ్చిందనే చెప్పాలి . ఇక పై తన యాక్టింగ్ పై  మరింత దృష్టిపెట్టాలని నిర్ణయించారట . దాని లో బాగంగానే ఎన్టీఆర్ నుండి కొన్ని ఇంపుట్స్ తీసుకోవడం మంచిదని సన్నిహితులు రామ్ చరణ్ కు  సలహా ఇచ్చినట్టు సమాచారం.

రీసెంట్‌గా ‘జై లవ కుశ’ చిత్రం చూసిన రామ్‌చరణ్ వెంటనే ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడినట్లుగా తెలుస్తుంది. జై, లవ, కుశ ఈ మూడు పాత్రల్లో అద్భుతంగా చేశావంటూ ఎన్టీఆర్‌పై చరణ్ ప్రశంసలు కురిపించాడని, ముఖ్యంగా జై పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని ఎన్టీఆర్‌కి చరణ్ చెప్పినట్లుగా కూడా తెలిసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news