Moviesమెగాస్టార్ ట్విట్ పై రత్తాలు స్పందన ఇదే ! 

మెగాస్టార్ ట్విట్ పై రత్తాలు స్పందన ఇదే ! 

రత్తాలు రత్తాలు పాటలో ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేసిన రాయ్ లక్ష్మీని, మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సర్‌ప్రైజ్ చేశారు. ఆమె నటించిన జూలీ 2 చిత్రం నవంబర్ 24న విడుదలవున్న సందర్భంలో, ఆమెకి చిరు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని పోస్ట్ చేశారు.ఈ వీడియో చూసి రాయ్ లక్ష్మి తెగ ఆనంద పడిపోతోంది. ఇంకా ఏమంటుందంటే..

ఇది నా జీవితంలో మరచిపోలేని రోజు.. మెగాస్టార్‌ చిరంజీవి మెగా సర్‌ప్రైజ్‌తో నన్ను మెస్మరైజ్‌ చేశారు. నా లైఫ్‌లో బెస్ట్‌ గిఫ్ట్‌ ఇదే..’ అంటూ రాయ్ లక్ష్మి ఆనందంలో మునిగిపోయింది.

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాయ్  లక్ష్మి నటించిన ‘జూలీ 2′ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిరంజీవి వీడియో క్లిప్‌ రూపంలో రాయ్ లక్ష్మికి  శుభాకాంక్షలు తెలియజేశారు. ”జూలీ 2’ ద్వారా రారు లక్ష్మీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. కెరీర్‌లో 50వ సినిమాగా చేస్తున్న ‘జూలీ 2′ ఆమెకు చాలా ప్రత్యేకం.

భిన్న భాషల్లో రాయ్ లక్ష్మి నటించడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూనే కొసమెరుపుగా ఫ్లైయింగ్‌ కిస్‌తో చిరు మరోమారు విషెస్‌ తెలియజేయడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

చిరు పంపిన వీడియో క్లిప్‌ను ‘రత్తాలు’ను చిరు సర్‌ప్రైజ్‌ చేశారంటూ సామాజిక మాధ్యమం ద్వారా రారు అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రంలో ‘రత్తాలు.. రత్తాలు’ అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌లో మెగాస్టార్‌ సరసన  ఆమె తళుక్కుమంది.

b4a5c7d3d7cfb4bb39f89a39587da2f5

ఇంతకీ చిరు ట్విట్ కి ఈ ముద్దు గుమ్మా ఏమి సమాధానం ఇచ్చిందో తెలుసా ..?  ‘‘ ఓ మై గాడ్, నిజంగా మీ దీవెనలు నా హృదయాన్ని హత్తుకున్నాయి. ఇది నా జీవితంలోనే గొప్ప బహుమతిగా భావిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదములు చిరంజీవి గారూ.., మీ దీవెనలను గౌరవంగా స్వీకరిస్తున్నా. మీరిచ్చిన ఈ ఉత్సాహంతో మీ రత్తాలు సర్‌ప్రైజ్ అయింది. లవ్ యు..సార్’’ అంటూ రిప్లై ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news