Movies'సైరా'కు ముగ్గురు కావాల్సిందేనా..!

‘సైరా’కు ముగ్గురు కావాల్సిందేనా..!

మెగాస్టార్ 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో ఇప్పటికే నయనతార హీరోయిన్ గా ఫైనల్ కాగా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారట. సిద్ధమ్మ, పేరమ్మ, ఓబులమ్మ లలో సిద్ధమ్మ నరసింహారెడ్డికి పెద్ద భార్య.

అంతేకాదు సిద్ధమ్మకు దొర సుబ్బయ్య అనే కొడుకు కూడా ఉన్నాడట. నయనతార కూడా సిద్ధంగా నటిస్తుందని తెలుస్తుంది. ఇక మిగిలిన ఇద్దరు భార్యల కథను సినిమాలో ఉంచుతారా ఒకవేళ ఉంటే ఆ ఇద్దరు భార్యలుగా ఎవరు నటిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్యనే అనుష్క కూడా సైరాకు సైన్ చేసిందని రూమర్ వచ్చింది. ఒకవేళ మిగతా ఇద్దరు భార్యలలో ఒక పాత్రలో ఆమెను సెలెక్ట్ చేసి ఉండొచ్చని అంచనా.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో తమిళ కన్నడ పరిశ్రంకు చెందిన నటులు కూడా నటిస్తుండటం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news