Gossipsమెగాస్టార్ చిరంజీవి మహావీర్ కు బాహుబలి స్థాయిలో రాజమౌళి ...

మెగాస్టార్ చిరంజీవి మహావీర్ కు బాహుబలి స్థాయిలో రాజమౌళి క్రేజ్..!

మెగాస్టార్ నటించబోయే 151వ సినిమా రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతుంది. పరుచూరి సోదరులు కథ అందిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రూపొందించనున్నారట.

రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ గా మహావీర్ అని పెట్టబోతున్నారట. సినిమాకు ముందు నుండి హైప్ తెచ్చే క్రమంలో ఈ మెగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శక ధీరుడు రాజమౌళి చేత రిలీజ్ చేయిస్తున్నారట. మహావీర్ సినిమాకు రాజమౌళి క్రేజ్ కూడా యాడ్ అవ్వాలని మేకర్స్ ఆలోచన.

బాహుబలి రెండు పార్టులతో తానేంటో సత్తా చాటుకున్న జక్కన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కు తన వంతు సహకారం అందిస్తున్నాడు. మొన్నామధ్య స్క్రిప్ట్ లో కూడా రాజమౌళి ఇన్వాల్వ్ మెంట్ ఉందని టాక్. ఏది ఏమైనా రాజమౌళి ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి మహావీర్ సినిమా కచ్చితంగా బాలీవుడ్ లో కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఆగష్టు 22న మహావీర్ ఫస్ట్ లుక్ రివీల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news