Gossipsమెగా స్టార్ - పవర్ స్టార్ కాంబినేషన్ తెరకెక్కుతోందా..?

మెగా స్టార్ – పవర్ స్టార్ కాంబినేషన్ తెరకెక్కుతోందా..?

మెగా ఫ్యామిలీ ఈ మధ్యకాలం లో ఎక్కువగా ప్రజల నోట్లో నానుతున్న పేరు. ఈ మెగా బ్రాండ్ నుంచి ఎంతో మంది ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇక మెగా బ్రదర్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. మెగా స్టార్ పవర్ స్టార్ ఇప్పటికే ఫిల్మ్ ఇండ్రస్ట్రీతో పాటు , రాజకీయాల్లో కూడా దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ ప్రధాన పాత్ర్రలో ఆయన 151 వ చిత్రం సైరా ప్రారంభం కాబోతోంది.

ఇప్పుడు ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఓ సంచలన వార్త హల్ చల్ చేస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న సైరా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ అతిథి పాత్ర చేయనున్నాడనే వార్త. దీనిపై సైరా మూవీ యూనిట్ సభ్యుల నుంచి మాత్రం ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోయినప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో మాత్రం సైరాలో పవన్ అతిథి పాత్రపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

పవన్ పాత్ర నిడివి కూడా 10 నిమిషాలు ఉండబోతుందని ప్రచారంలోకి రాగానే మెగా ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. చిరంజీవి-పవన్ కల్యాణ్‌ల మధ్య వున్న అనుబంధం అనేక సందర్భాల్లో న్యూస్ హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. అన్నయ్య చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రావడాన్ని స్వాగతించిన పవన్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా చేస్తున్న సమయంలోనే ఆయన్ని కలిసి అభినందించారు. పవన్ చిరు కాంభినేషన్ కొత్తేమి కాదు. గతంలో చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ లో పవన్ కళ్యాన్ క్లయిమాక్స్ లో కనిపించి అదరగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవ్వబోతుండడం తో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేవు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news