Gossips'హలో' అనబోతోన్న 'మెగా స్టార్స్'

‘హలో’ అనబోతోన్న ‘మెగా స్టార్స్’

అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తోన్న రెండో సినిమా ‘హలో’. ఈ సినిమా మీద నాగార్జున చాలా అసలే పెట్టుకున్నాడు. మొదటి సినిమా అఖిల్ భారీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో మొదటి సినిమాతోనే అఖిల్ భవిష్యత్తు ప్రశ్నర్ధాకంలో పడిపోయింది. అందుకే రెండో సినిమా మీద అక్కినేని కుటుంబం అంతా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ వేసుకుని మరీ ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ నెల 22 న రిలీజ్ కాబోతుండడంతో ఈ సినిమా ప్రమోషన్ మీద బాగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని నాగార్జున ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు ఆయనతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా వస్తారని అఖిల్ చెప్తున్నాడు.

నాగార్జున కోసం చిరు వస్తుండగా…అఖిల్ కోసం చెర్రీ వస్తున్నాడు. ఇలా మెగా హీరోలైన తండ్రి కొడుకులు ‘ హలో’ ప్రమోషన్ కి వస్తుండడంతో అందరిలోనూ ఆనందం వ్యక్తం అవుతోంది,
నాగార్జున కుడా ఈ చిత్రమే అఖిల్ కు సరైన లాంచ్ అని అభిప్రాయపడుతుండగా అఖిల్ కూడా ఈసారి ఎలాగైనా విజయం అందుకుని టాలీవుడ్ లో హీరోగా స్థిరపడిపోవాలని కలలుకంటున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news