Newsదాసరి నారాయణ రావు స్థానం లో మెగాస్టార్..!

దాసరి నారాయణ రావు స్థానం లో మెగాస్టార్..!

ఇదవరకు ఓ మంచి సినిమా లేక గొప్ప సినిమా వచ్చింది అంటే దాసరి నారాయణ రావు ఆ సినిమా యూనిట్ అందరికి తన విశెష్ అందించేవారు. దాసరి మరణం తర్వాత అలా ముందుకొచ్చి చిన్న సినిమాను బ్రతికించే వారు లేరని అనుకున్నారు. కాని నేనున్నా అంటూ ముందుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాసరి తర్వాత ఆ స్థానాన్ని ఇండస్ట్రీ బాగోగులు చూసే పెద్ద మనిషిగా చిరంజీవిని ఎన్నుకోవాలని చూస్తున్నారు.

ఆ క్రమంలోనే ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ అయిన సావిత్రి బయోపిక్ మహానటి టీంను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించడం జరిగింది. తన మొదటి సినిమాలోనే సావిత్రి గారితో నటించే అదృష్టం దొరికిందని ఆమె నా అభిమాన నటి అని ఇక ఆమె బయోపిక్ గా వచ్చిన మహానటి అద్భుతంగా ఉందని అన్నారు.

సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్న మెగాస్టార్ ఇలాంటి సినిమా తీసిన నిర్మాతలు ప్రియాంకా, స్వప్నాలను ప్రశంసించారు. ఇక సినిమా దర్శక నిర్మాతలకు శాలువాలు కప్పి సినిమా విజయ ఆనందాన్ని మరింత పెంచారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో సినిమాపై తన అభిప్రాయన్ని ఎమోషనల్ గా మీడియాతో పంచుకున్నారు చిరంజీవి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news