Moviesమెగా లుక్ చూస్తే.. ఫ్యాన్స్ మీసం మీసం మెలెయాల్సిందే..! (ఫొటోస్)

మెగా లుక్ చూస్తే.. ఫ్యాన్స్ మీసం మీసం మెలెయాల్సిందే..! (ఫొటోస్)

ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీతో అదరగొట్టిన బిగ్ బాస్ అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తర్వాత సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కు రెడీ అవుతున్న చిరు ఆ సినిమా కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ముఖవచ్చస్సులో మార్పులు చూపిస్తున్న చిరు ఇప్పుడు ఏకాంగా ఓ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.

రీసెంట్ గా ఓ పబ్లిక్ మీట్ లో పాల్గొనేందుకు వచ్చిన చిరుని చూసి అందరు షాక్ అవుతున్నారు. మీసాలతో ఉన్న మెగా లుక్ చూస్తే మెగా అభిమానులు కూడా మీసం మెలేయడం ఖాయమని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాకు టైటిల్ గా మహవీర అని పెట్టబోతున్నారట. తెలుగు తమిళ హింది భాషల్లో సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి.

మెగాస్టార్ లుక్ తో మరోసారి ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేసింది. మెగాస్టార్ బర్త్ డే ఆగష్టు 22న ఈ సినిమా ముహుర్తం పెట్టబోతున్నారట. 150 ఏళ్ల క్రితం జరిగిన కథ కాబట్టి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని అంటున్నారు.

mega star chiranjeevi new look
mega star chiranjeevi new look

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news