Gossips‘ధృవ’తో రామ్ చరణ్ ఆ టార్గెట్స్‌ని అందుకోగలడా..?

‘ధృవ’తో రామ్ చరణ్ ఆ టార్గెట్స్‌ని అందుకోగలడా..?

From a long time mega hero Ram Charan trying to reach two targets, but he fails every time. This time he is thinking that Dhruva movie will fulfill his dreams at the same time. Fans also eagerly waiting for his achievement. Let’s see can he reached his goal or not.

ఓ హీరో ఒక సినిమాతో మంచి విజయం అందుకుంటే.. దాని తదుపరి చిత్రం అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటారు. కొందరు హీరోలకు ఆ ఫార్ములా బాగానే వర్తించింది కానీ.. మరికొందరికి మాత్రం ఇంకా వర్కౌట్ అవ్వలేదు. అలాంటివారి జాబితాలో మెగాహీరో రామ్ చరణ్ ఒకడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి వారసత్వంతో ‘చిరుత’ మూవీ ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ మెగాహీరో.. రెండో సినిమా ‘మగధీర’తోనే చరిత్ర సృష్టించాడు. కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్‌ని ఓ ఆటాడుకున్నాడు. దాంతో.. అతని రేంజ్ పెరిగిపోయింది. ఆడియెన్స్ అతని నుంచి ఆ తరహా సినిమాలే కోరుకున్నారు. కానీ.. చెర్రీకి మాత్రం ‘మగధీర’ తర్వాత ఆ స్థాయి హిట్ ఇంకా దక్కలేదు.

మధ్యలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు కానీ.. అది కూడా మనోడికి హ్యాండ్ ఇచ్చేసింది. దీంతో.. తెలుగులోనే తన సత్తా చాటుకోవాలని మళ్ళీ ప్రయత్నించాడు. తన మాస్ ఇమేజ్‌కి భిన్నంగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా చేశాడు. అదీ అతనికి నిరాశే మిగిల్చింది. ఇలా అయితే లాభం లేదనుకుని.. కామెడీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో తన తండ్రి సహకారం కూడా తీసుకున్నాడు. ఈ చిత్రం ‘మగధీర’ని బీట్ చేయకపోయినా.. ఆ రేంజ్ హిట్ అవుతుందని చెర్రీతోపాటు ఫ్యాన్స్ ఆశించారు. కానీ.. ఆ చిత్రం సైతం పత్తాలేకుండా పోయింది. ఆ దెబ్బకు చరణ్ క్రేజ్ అమాంతం పడిపోయింది. ఇలాంటి టైంలో తొందరపడకుండా.. బాగా ఆలోచించి ‘తని ఒరువన్’ రీమేక్ చేసేందుకు అంగీకరించాడు. ఈ చిత్రం కోసం బాగా కష్డపడ్డాడు. తొలిసారి తన ఫిజిక్, స్టైల్ మార్చేశాడు కూడా. దీంతో.. మొదటినుంచి ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కి పాజిటివ్ టాక్ రావడం, పాటలు హిట్టవ్వడంతో.. దీనికి మరింత క్రేజ్ పెరిగింది. మరి.. ఈ మూవీ అయినా ‘మగధీర’ని బీట్ చేస్తుందా? లేదా? వెయిట్ చేయాలి.

ఇక చెర్రీ అందుకోవాల్సిన మరో టార్గెట్.. ఓవర్సీస్‌లో మిలియన్ మార్క్‌ని క్రాస్ చేయడం. అక్కడ నాని, నితిన్‌లే కాదు.. ‘పెళ్లిచూపులు’ సైతం మిలియన్ మార్క్ దాటేసింది కానీ చరణ్ మాత్రం ఇంతవరకు ఆ మార్క్‌ని అందుకోలేదు. ‘మగధీర’ చిత్రం కూడా దాన్ని అందుకోలేదు. అప్పట్లో అంత మార్కెట్ లేకపోవడంతో.. ఆ మూవీ ఆ మార్క్‌ని అందుకోలేదు. అయితే.. చరణ్ దాని తర్వాత చేసిన సినిమాలన్నీ రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్‌లే కావడంతో అక్కడ హిట్ అవ్వలేదు. ఓవర్సీస్ ఆడియెన్స్ వైవిధ్యభరితమైన చిత్రాలే కోరుకుంటారు కాబట్టి.. అలాంటివే అక్కడ హిట్ అవుతాయి. కాబట్టి.. చెర్రీ చేసిన ‘ధృవ’ వైవిధ్యభరితమైంది. దీంతో.. ఈ చిత్రం మిలియన్ మార్క్ లక్ష్యాన్ని అందుకుంటుందని ట్రేడ్, యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి.. ఆ మార్క్‌ని అందుకుని తన రెండో టార్గెట్‌ని చెర్రీ రీచ్ అవుతాడా? లేదా? అనేది తెలుసుకోవాలంటే.. వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news