Gossipsమెగా పవర్ స్టార్ భార్య ఫోన్ చెక్ చేస్తాడా?.. ఎందుకో..అసలు సంగతి...

మెగా పవర్ స్టార్ భార్య ఫోన్ చెక్ చేస్తాడా?.. ఎందుకో..అసలు సంగతి ఏంటో తెలుసా..?

స్టార్ హీరోలు తమ రియల్ లైఫ్ పార్ట్నర్స్ తో ఎలా ఉంటారు. ఒకప్పుడు సినిమా తారాల పర్సనల్ లైఫ్ గురించి ఎవరో చెబితేనో ఏదో జరిగితేనో తెలిసేది కాని సోషల్ మీడియా వచ్చాక అందరి గురించి అందరికి తెలుస్తున్నాయ్. ముఖ్యంగా తమ అభిమాన నటుల రియల్ లైఫ్ విషయాలను తెలుసుకునేందుకు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అభిమానులు.

ఈ క్రమంలో వారికి నచ్చే మెచ్చే విషయాలను స్టార్సే ముందుంచుతున్నారు. ప్రస్తుతం స్టార్ ఫ్యామిలీస్ తో మహేష్, నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆ తర్వాత రాం చరణ్, ఉపాసన కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ పెడుతుంటారు. చైతు, సమంత కూడా ఫ్యాన్స్ తో పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన చరణ్ కు తెలియకుండా సర్ ప్రైజ్ గా అప్డేట్స్ పెడుతుందట.

అది తెలుసుకునేందుకు చరణ్ ఉపాసన ఫోన్ తరచూ చెక్ చేస్తాడని తెలుస్తుంది. తన ఫ్యాన్స్ కు తను దూరం అవుతున్నా అనే భావన రానివ్వకుండా చరణ్ అప్డేట్స్ ఉపాసన ట్విట్టర్ హ్యాండిల్స్ తో పెడుతుంది. రోజులో ఫ్రీ టైం లో ఉపాసన మొబైల్ లో అప్డేట్స్ చెక్ చేసుకుంటాడట చరణ్. నిజంగా వీరి బంధం చూస్తుంటే చూడముచ్చటేస్తుంది. ఉపాసనని ఫాలో అవడమే కాకుండా తాను కూడా సోషల్ మీడియా ట్విట్టర్ లోకి రావాలని ఉందని. కాని అక్కడకి వస్తే ప్రతి విషయం మీద స్పందించాల్సి ఉంటుందని. ఒకవేళ టైం కుదరక రెస్పాండ్ కాకుంటే అనవసరమైన ఇష్యూస్ వస్తాయని అంటున్నాడు చరణ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news