Gossipsమెగా పండుగ వ‌చ్చేస్తుందోచ్‌!

మెగా పండుగ వ‌చ్చేస్తుందోచ్‌!

మెగా పండుగ వ‌చ్చేస్తుందోచ్‌!

చిరంజీవి రామ్ చ‌ర‌ణ్

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుణ్ తేజ్

బ‌న్నీ సాయిధ‌ర‌మ్

ఇలా ఒక‌రి త‌రువాత ఒక‌రు థియేట‌ర్ల‌కు రానున్నారు.

దీంతో మెగా అభిమానులకు పండగ సీజన్ త్వ‌ర‌లో మొదలుకానుంది. 2017 డిసెంబరు నుంచి 2018 ఏప్రిల్‌ వరకూ వరుసగా నెలకో సినిమా చొప్పున మెగా ఫ్యామిలీకి చెందిన ఐదుగురు హీరోల చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా అరుణాచల్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జవాన్‌’ డిసెంబ‌ర్ ఒక‌టిన విడుద‌ల కానుంది.అటుపై జ‌న‌వ‌రి ప‌దిన సంక్రాంతి కానుక‌గా ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి విడుద‌ల అవుతుంది.అప్పుడే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది.  ఫిబ్రవరి 9న వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం మార్చి 16న రాక క‌న్ఫం అయ్యింది. ఆఖ‌రిగా బ‌న్నీ వేస‌వికి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా పేరిట  ఏప్రిల్ 27న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాడు.ఇలా రానున్న కాలంలో మెగా హీరోల సంద‌డి షురూ కానుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news