GossipsMCA సెన్సార్ పూర్తి... అదిరిపోయే స్టోరీ లైన్

MCA సెన్సార్ పూర్తి… అదిరిపోయే స్టోరీ లైన్

డబుల్ హ్యాట్రిక్ హీరో నాచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందిన సినిమా `ఎం.సి.ఎ`. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ఫై దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మించారు.తాజాగా, మిడిల్ క్లాస్ అబ్బాయి సెన్సార్ పనులని పూర్తి చేసుకొన్నాడు. యు/ఎ సర్టిఫికెట్ ని ఎందుకొన్నాడు. ఐతే, ఇప్పటికే మిడిల్ క్లాస్ అబ్బాయిపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకొన్నాడు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి సూపర్ అనేసినట్టు సమాచారమ్.

వదిన, మరిది మధ్య అనుబంధంపై సినిమా తెరకెక్కింది. వదిన భూమిక, మరిదిగా నాని నటన అద్భుతం అంటున్నారు. టైటిల్’కి తగ్గట్టుగా సినిమా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవుతుందని టాక్. ఈ సినిమాతో నాని ఖాతాలో మరో హిట్ పడినట్టేనని చెబుతున్నారు.

దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని అందించారు. అంతకుముందే విడుదలైన ఈ సినిమా పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి అంచనాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్‌గా విడులైన ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.

సినిమా ష్యూర్ హిట్ అవుతుందని అందరూ అంటున్నారు. ఈ అంచనాలకు రీచ్ అయ్యేలా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సమీర్‌రెడ్డి విజువల్స్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అవుతుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎటువంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది.

సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ విడుదల చేస్తున్నాం“ అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news