Gossips" MCA " 5డేస్ కలెక్షన్స్... నాని బీభత్సం

” MCA ” 5డేస్ కలెక్షన్స్… నాని బీభత్సం

లాంగ్ వీకెండ్ ప్లాన్ తోనే సినిమా రిలీజ్ చేసిన నాని ఈ ఇయర్ కూడా హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు. శ్రీరాం వేణు డైరక్షన్ లో నాని నటించిన ఎం.సి.ఏ సినిమా గురువారం రిలీజ్ అవగా సినిమా కలక్షన్స్ తో మరోసారి నాని తన సత్తా చాటుతున్నాడు. 5 రోజుల్లో నైజాం లోనే 9 కోట్ల కలక్షన్స్ సాధించింది ఎం.సి.ఏ.

ఐదవరోజు ఈ సినిమా 1.46 కోట్ల కలక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం 5వ రోజుతో దాదాపు బిజినెస్ లాభాం తెచ్చిపెట్టిందని తెలుస్తుంది. మొత్తానికి నాని స్టార్ స్టేటస్ అని చెప్పడానికి ఎం.సి.ఏ కలక్షన్స్ లెక్క చూసి నమ్మాల్సిందే. మొదట ఈ సినిమాకు డివైడ్ టాక్ రాగా పోటీగా అఖిల్ హలో కూడా కూల్ ఎంటర్టైనర్ కావడంతో నానిని ఢీ కొట్టలేకపోయాడు.

మొత్తానికి నాని ఎం.సి.ఏ తో మరోసారి తన సత్తా చాటాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధితో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత వరుస రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. చూస్తుంటే నాని హిట్ సినిమాల హవా 2018లో కూడా కొనసాగుతాడనే అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news