Gossipsమారుతి, చైతు.. ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్..!

మారుతి, చైతు.. ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్..!

సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమాకు టైటిల్ గా శైలజ రెడ్డి అని పెట్టారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో శైలజ రెడ్డిగా రాజమాత శివగామి అదేనండి రమ్యకృష్ణ పోశిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయెల్ నటిస్తుందని టాక్.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రీసెంట్ గా మహానుభావుడుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న మారుతి చైతుతో తీస్తున్న ఈ శైలజ రెడ్డి అల్లుడు కూడా అదే రేంజ్ ఫలితాన్ని అందుకుంటాడని అంటున్నారు. ఈ ఇయర్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో హిట్ అందుకున్న చైతు ఈమధ్య వచ్చిన యుద్ధం శరణం సినిమా నిరాశ పరచింది.

ప్రస్తుతం చందు మొండేటితో సవ్యసాచి సినిమా చేస్తున్న చైతన్య మారుతి సినిమాకు సంసిద్ధం అవుతున్నాడు. త్వరలో షెడ్యూల్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమా సమ్మర్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news