Moviesటాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం..శోకసముద్రంలో సిని పరిశ్రమ..!

టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం..శోకసముద్రంలో సిని పరిశ్రమ..!

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మణిశర్మ తండ్రి వయోలిన్ విధ్వాంసుడు యనమండ్ర నాగయజ్ఞ (92) ఈరోజు తెల్లవారు ఝామున తుది శ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ అంత గొప్ప వాడు అయ్యేందుకు తండ్రే కారణమని చెప్పొచ్చు.

ఆయన దగ్గర ఉన్న సంగీత సరస్వతిని తనయుడికి అందించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ముద్ర వేసుకునేలా చేశారు. అయితే మణిశర్మ తండ్రి పరిశ్రమకు సుపరిచితులు కారని తెలుస్తుంది. ఇక ఆయన మరణానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా తెలియాల్సి ఉంది. స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన మణిశర్మ ప్రస్తుతం వెనక్కి తగ్గారు.

మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఛలో సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మణిశర్మ ఇంట్లో జరిగిన ఈ విషాదానికి సిని ప్రముఖుల నుండి ప్రగాడ సానుభూతి అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news