Gossipsమలయాళీ బ్యూటీ బాలయ్య కూతురట..!

మలయాళీ బ్యూటీ బాలయ్య కూతురట..!

బాలయ్య తన 100వ చిత్రం పూర్తి చేసిన తర్వాత సినిమాలు వేగాన్ని పెంచారు. కుర్ర హీరోలకి పోటీగా తనదైన శైలిలో పాత్రలను చేస్తూ ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా బాలయ్య సినిమాలు చాలా ప్రత్యేకమని చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా ఆయన చేసే డ్యాన్సులు- యాక్షన్ సీన్స్ కి ఇంకా మంచి ఆదరణ లభిస్తోంది. తెరపై ఆయన డైలాగ్ వినబడితే చాలు ఫ్యాన్సుకి పిచ్చెక్కిపోవాల్సిందే ..

ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తీసిన పైసా వసూల్ సినిమాను రిలీజ్ చేసిన బాలయ్య తన అభిమానులను కాస్త నిరాశపరిచాడు. అయితే ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో రెడీ అవ్వబోతున్నారు. తమిళ దర్శకుడు కె.ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. ఇప్పటికే నయనతారను అలాగే మలయాళీ బ్యూటీ నటాషా దోషిని కూడా ఒకే చేశారు. మరొక హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే అందులో నయన బాలయ్యతో రొమాన్స్ చేయబోతున్నారు కాని.. నటాషా మాత్రం హీరోయిన్ కాదట.
అయితే ఈ సినిమా కథ లీకైంది అంటూ న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతింది . నాయన తార , బాలయ్య ప్రేమించుకుంటారు , అనివార్య కారణాలవల్ల నాయన తార వేరొకరిని పెళ్లిచేసుకోవడం, ఆమెకు ఒక కూతురు పుట్టాక మరణించడం , ఆమె కూతురుకు విల్లన్స్ గండం ఉండడం , అప్పటికి పెళ్లికాని బాలయ్య ఆమెను సంరక్షించడమే అసలు కదా అని వినికిడి . ఆ కూతురి పాత్రలోనే నటాషా నటిస్తుంది.

కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కూతురిగా కనిపించనున్న నటాషా పాత్ర చాలా కీలకం కానుందట. బాలయ్య ఎప్పుడు కనిపించని పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. 40ఏళ్ల వయస్కుడిగా సరికొత్తగా అలరించనున్నాడని తెలుస్తోంది. మొదట నటాషా సినిమాలో హీరోయిన్ అనే వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు బాలయ్య కూతురు అని చెబుతున్నారు. మరి ఈ రిలేషన్ బాలయ్య సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈ సినిమాకు “జయసింహ” అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్సుంది.

balayya movie 102
balayya movie 102

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news