Gossipsస్పైడర్ ప్రొడ్యూసర్స్ కి మహేష్ ఆయింట్మెంట్ . ఎం చేసారో తెలుసా...

స్పైడర్ ప్రొడ్యూసర్స్ కి మహేష్ ఆయింట్మెంట్ . ఎం చేసారో తెలుసా ..!

తమిళ్ ఏస్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం సెప్టెంబర్ 26న రిలీజ్ అయ్యి డిసాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే . మహేష్ బాబు కేరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా స్పైడర్ . 120  కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ  చిత్రం సుమారు 50  కోట్ల వరకు నష్టాలు మిగిల్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా .

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ ఆ లాస్ ని కొంత మేరకు భరిస్తారని వినికిడి . తన రెమ్యూనరేషన్ లో కొంత భాగం తిరిగిచ్ఛే ఆలోచనలో ఉన్నారట మహేష్ . అయితే 25 కోట్ల వరకు తీసుకున్న మహేష్ ఎంత వరకు తిరిగి ఇస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది . ఆ మొత్తాన్ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ భరత్ అను నేను చిత్రం రిలీజ్ లోపు ఇచ్చేస్తానని మహేష్ ఒప్పుకున్నట్లు సమాచారం .

అయితే మహేష్ కి ఇది కొత్తేమికాదు, ఇంతక ముందు కూడా చాలా సార్లు ప్రొడ్యూసర్స్ ని సేవ్ చేసే ప్రయత్నం చేసారు . ఆ ప్రొడ్యూసర్స్ కి అయితే తన రెమ్యూనరేషన్ లోని కొంత భాగాన్ని తిరిగివ్వడమో లేక మరో సినిమా తక్కువ రెమ్యూనరేషన్ కి చెయ్యడమో చేసారు పూర్వం. చూడాలి మరి మహేష్ స్పైడర్ ప్రొడ్యూసర్స్ ని ఎంత వరకు సేవ్ చేస్తారో

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news