Gossipsరెమ్యూనరేషన్ లేకుండా 14 రీల్స్ ప్రొడక్షన్ లో మహేష్.... డైరెక్టర్ ఎవరో...

రెమ్యూనరేషన్ లేకుండా 14 రీల్స్ ప్రొడక్షన్ లో మహేష్…. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్

దూకుడు సినిమాతో బడా నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న 14 రీల్స్ వారు ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత 1 నేనొక్కడినే, ఆగడు ఫ్లాపులతో కాస్త వెనుకపడ్డారు. అందుకే నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తీసి హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన నితిన్ లై కూడా నిరాశపరచడంతో మళ్లీ మహేష్ తోనే సినిమా చేయాలని చూస్తున్నారు. మహేష్ కూడా 14 రీల్స్ కు సపోర్ట్ గానే ఉన్నారట.

ఇక ఈ బ్యానర్లో మహేష్ తో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఊర మాస్ సినిమాలను తీసే బోయపాటి శ్రీను మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది. అబ్బో ఆ సినిమా ఇక సంచలనాలే. ఈ క్రేజీ కాంబినేషన్ ఎన్నాళ్ల నుండో సెట్ అవ్వాలని చూస్తున్నా ఫైనల్ గా 14 రీల్స్ వారు దీన్ని సెట్ చేశారట. ఈమధ్యనే మహేష్ కోసం అద్భుతమైన కథ ఉందని చెప్పిన బోయపాటి ప్రస్తుతం మహేష్ చేస్తున్న కొరటాల శివ, వంశీ సినిమాల తర్వాత సినిమా చేస్తాడని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news