Gossipsమహేష్ డబుల్ ట్రీట్.. ఫ్యాన్స్ కు ఇక పండుగే..!

మహేష్ డబుల్ ట్రీట్.. ఫ్యాన్స్ కు ఇక పండుగే..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్ ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. అయితే కేవలం ఓ రోబోటిక్ స్పైడర్ తో టీజర్ ను అది కూడా 30 సెకన్ల నిడివితో మహేష్ ఉష్.. అంటూ చెప్పిన టీజర్ ఒక్కటే స్పైడర్ నుండి రిలీజ్ అయ్యింది. అసలు సిసలైన టీజర్ గురించి ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు కానుకగా స్పైడర్ టీజర్ రిలీజ్ కానుందట.

ఇక అదే రోజు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ భరత్ అను నేను మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మహేష్ ఫ్యాన్స్ కు ఒకేసారి రెండు టీజర్లతో అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఈ డబుల్ బొనాంజాకు ఫ్యాన్స్ అంతా సంసిద్ధమై ఉన్నారు.

బ్రహ్మోత్సవం తర్వాత దాదాపు సంవత్సర గ్యాప్ తీసుకున్న మహేష్ తన సినిమా టీజర్ విశేషాలతో వస్తున్నాడు. స్పైడర్ తెలుగు తమిళ భాషల్లో నిర్మతమవుతుండగా కొరటాల శివతో వస్తున్న భరత్ అను నేను కూడా స్పైడర్ హిట్ అయితే తమిళంలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news