Gossipsమహేశ్.. 'భరత్ అనే నేను' రిలీజ్ డేట్ ఫిక్స్

మహేశ్.. ‘భరత్ అనే నేను’ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రిన్స్ మహేశ్ బాబు స్పైడర్ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ‘భరత్ అనే నేను’. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరగనుంది.
మహేశ్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ మూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా.. ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. మహేశ్ సరసన కైరా అద్వాని తొలి సారిగా హీరోయిన్‌గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news