Gossipsమహేష్ సీక్రెట్ పర్యటన వెనుక కారణం అదేనా ..?

మహేష్ సీక్రెట్ పర్యటన వెనుక కారణం అదేనా ..?

ఈ మధ్య తెలుగు హీరోలంతా తెగ టూర్ లు వేసేస్తున్నారు. మొన్నే మధ్య ఎన్టీఆర్ ఫ్యామిలీ తో చాలా లాంగ్ ట్రిప్ వేసాడు. ఇప్పుడు అదే కోవలో మన తెలుగు హీరోలు కూడా ముంబై బాట పట్టారు. సాహో సినిమా కోసం ప్రభాస్, కాలా చిత్రం కోసం రజనీకాంత్‌ ముంబై లో చాలా కాలంగా మకాం వేశారు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఏదో పనిమీద సల్మాన్‌తో భేటి కావడం ఇలా ముంబై చుట్టూ తెలుగు స్టార్ హీరోలు చెక్కెర్లు కొడుతున్నారు. నేనేమన్నా తక్కువ తిన్నానా ఏంటి అనుకున్నాడో ఏమో కానీ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ముంబై బాట పట్టాడు. అయితే అత్యంత రహస్యంగా వెళ్లిన మహేష్ తో నమ్రత కూడా ఉన్నారు.13e096adddc11921923a87c2e111e346 403924e88cacacee715e545d30f08049

ముంబైలో మహేష్ కనిపించడం కొత్తేమి కాదు ఎందుకంటే ముంబై మహేశ్‌కు అత్తారిల్లు లాంటింది.
కానీ ఇంతా సీక్రెట్ గా ఎందుకు ముంబైకి వెళ్లారు అనేది ప్రశ్నగా మారింది. దక్షిణాదిలో మహేశ్‌ హవా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్‌ హీరోలను మించిన అందం అభినయం మహేష్ లో ఉన్నాయి. హుబలి తర్వాత తెలుగు హీరోల బ్రాండ్ ఇమేజ్ ఉత్తరాదిలో పెరిగింది. దాంతో బాలీవుడ్‌లో మహేశ్‌బాబు బ్రాండింగ్‌ను పెంచేందుకు నమ్రత కృషిచేస్తున్నారు.

మహేశ్ నటించిన చిత్రాలను హిందీలో ప్రమోట్ చేయడానికి, ఆయన సినిమాల బిజినెస్‌పై నమత్ర ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. స్పైడర్ చిత్రానికి సంబంధించిన బిజినెస్‌ను కూడా ఆమె డీల్ చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహేశ్ దృష్టి ముంబై పడిందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. బిజినెస్‌ మ్యాన్ సినిమాలో మహేశ్ డైలాగ్స్ చెప్పినట్టు ముంబై ని ఏదో చెయ్యడానికే మహేష్ చూస్తున్నట్టు ఉంది.012de0ae5488df09199397a512768922 ncLBGLEC

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news