Moviesస్పీడ్ పెంచిన మహేష్.. అసలైన లెక్క ఇదే..!

స్పీడ్ పెంచిన మహేష్.. అసలైన లెక్క ఇదే..!

సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే అతికష్టం మీద అభిమానులకు అందించే మహేష్ ఇప్పుడు ఊహించని రేంజ్ లో స్పీడ్ పెంచేశాడు. ఇది అలాంటి ఇలాంటి స్పీడ్ కాదు అసలైన లెక్క ఇదే అంటూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. మహేష్ మురుగదాస్ తో చేస్తున్న స్పైడర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది.
ఆ సినిమా పూర్తి కాకముందే శ్రీమంతుడు కాంబోలో కొరటాల శివతో భరత్ అను నేను ఫిక్స్ చేసుకున్నాడు మహేష్.

ఇక ఇప్పుడు ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు ముహుర్తం పెట్టేశాడు. సక్సెస్ ఫుల్ డైరక్టర్ సెన్సిబుల్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న వంశీ పైడిపల్లితో మహేష్ చేయబోయే 25వ సినిమా ఈరోజు ముహుర్తం పెట్టేశారు. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందట.

తన సెంటిమెంట్ ప్రకారం తన భార్య పిల్లలనే పంపించిన మహేష్ ఈసారి తన కొడుకు గౌతం కృష్ణ ఈ సినిమాకు క్లాప్ కొట్టడం జరిగింది. కె.రాఘవేంద్ర రావు, వినాయక్ సమక్షంలో సినిమా ముహుర్తం పెట్టేశారు. ఇక రెగ్యులర్ షూట్ ఎప్పుడు సినిమా టైటిల్ ఏంటి అన్న విషయాల గురించి త్వరలో వివరాలు తెలుస్తాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news